CWC 2023: రోహిత్‌ శర్మను ఉద్దేశించి కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యలు వైరల్‌

Rohit Sharma You Are: Kapil Dev Shares Images Of Teary Eyed India Captain - Sakshi

భారత్‌లో క్రికెట్‌ రూపురేఖలను మార్చి వేసిన ఘనత కపిల్‌ డెవిల్స్‌కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. వన్డే వరల్డ్‌కప్‌-1983లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్‌దేవ్‌ సేన.. అనూహ్య రీతిలో చాంపియన్‌గా నిలిచింది.

ఇంగ్లండ్‌ గడ్డ మీద.. అప్పటికే రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలా టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.

ఈ క్రమంలో 2011లో సొంతగడ్డ మీద ధోని సేన మరోసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచి.. ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేసింది. పుష్కరకాలం తర్వాత రోహిత్‌ బృందం కూడా అదే పునరావృతం చేస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో అజేయ రికార్డుతో ఫైనల్‌తో దూసుకెళ్లిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఐదుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల హృదయాలు కూడా ముక్కలయ్యాయి.

ఆస్ట్రేలియా ఆరోసారి జగజ్జేతగా నిలిచిన సంబరంలో మునిగిపోతే.. టీమిండియా కన్నీటితో మైదానాన్ని వీడింది. ఈ నేపథ్యంలో అభిమానులంతా రోహిత్‌ సేనకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ​మాజీ కెప్టెన్‌, టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌.. రోహిత్‌ శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘‘రోహిత్‌.. ఇప్పటికే నువ్వు చేసే పనిలో మాస్టర్‌వి అయిపోయావు.

నీకోసం ఇంకెన్నో విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు’’ అంటూ రోహిత్‌ కళ్లలో నీళ్లు నిండిన ఫొటోను కపిల్‌ షేర్‌ చేశాడు.

ఇక జట్టును ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియా మొత్తం నీతో ఉంది. మీరంతా చాంపియన్సే బాయ్స్‌. తలెత్తుకోండి. ట్రోఫీ గెలవాలన్నది మీ అంతిమ లక్ష్యం. కానీ దానితో పనిలేకుండానే మీరు ఇప్పటికే విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’’ అని కపిల్‌ దేవ్‌ బాసటగా నిలిచాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-11-2023
Nov 22, 2023, 14:43 IST
ICC WC 2023- PM Modi Gesture: టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలిచిన తీరుపై పాకిస్తాన్‌ లెజెండరీ...
22-11-2023
Nov 22, 2023, 12:59 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు నిన్ననే స్వదేశానికి చేరుకుంది. ఆరోసారి జగజ్జేతలుగా నిలిచిన ఆస్ట్రేలియా...
21-11-2023
21-11-2023
Nov 21, 2023, 17:49 IST
CWC 2023 Final Ind Vs Aus Winner Australia: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు....
21-11-2023
Nov 21, 2023, 16:59 IST
CWC 2023- Pakistan Team- PCB: వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సమూల మార్పులకు...
21-11-2023
Nov 21, 2023, 13:59 IST
2023 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుసగా...
21-11-2023
Nov 21, 2023, 12:35 IST
2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్‌గా ఆసీస్‌ మిడిలార్డర్‌ ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. లబూషేన్‌...
21-11-2023
Nov 21, 2023, 11:41 IST
2023 వన్డే ప్రపంచకప్‌ హాజరు విషయంలో ఆల్‌టైమ్‌ హై రికార్డు సెట్‌ చేసింది. ఈ ఎడిషన్‌ ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక...
21-11-2023
Nov 21, 2023, 03:56 IST
అహ్మదాబాద్‌: టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలా లేదంటే ముగించుకోవాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని దిగ్గజ...
20-11-2023
Nov 20, 2023, 20:26 IST
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం...
20-11-2023
Nov 20, 2023, 19:52 IST
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల...
20-11-2023
Nov 20, 2023, 18:35 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదరైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు...
20-11-2023
Nov 20, 2023, 17:13 IST
ఒకే ఒక్క మ్యాచ్‌.. కోట్ల మంది భారత  అభిమానుల గుండె పగిలేలా చేసింది. ఒకే ఒక్క మ్యాచ్‌.. సొంత గడ్డపై...
20-11-2023
Nov 20, 2023, 17:12 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో అనూహ్య ఓటమితో టీమిండియాకు నిరాశే మిగిలింది. సొంతగడ్డపై కప్‌ గెలవాలన్న పట్టుదలతో ఆది నుంచి అద్భుతంగా...
20-11-2023
Nov 20, 2023, 16:48 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఆఖరి మెట్టుపై (ఫైనల్స్‌) బోల్తా పడి...
20-11-2023
Nov 20, 2023, 16:07 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమి నేపథ్యంలో బీసీసీఐపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌...
20-11-2023
Nov 20, 2023, 15:52 IST
ICC WC 2023- Mohammad Shami Post Goes Viral: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఓటమిపై టీమిండియా సీనియర్‌ పేసర్‌...
20-11-2023
Nov 20, 2023, 15:44 IST
45 రోజుల పాటు క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన వన్డే ప్రపంచకప్‌-2023కు ఎండ్‌ కార్డ్‌ పడింది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా...
20-11-2023
Nov 20, 2023, 14:59 IST
వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఆరె వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌...
20-11-2023
Nov 20, 2023, 14:22 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top