క్వార్టర్‌ ఫైనల్లో రిత్విక్‌ జోడీ | Ritwik Choudhary in quarterfinals of Delray Beach Open ATP 250 tennis tournament | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో రిత్విక్‌ జోడీ

Feb 14 2025 4:01 AM | Updated on Feb 14 2025 4:01 AM

Ritwik Choudhary in quarterfinals of Delray Beach Open ATP 250 tennis tournament

డెల్‌రే బీచ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ పురుషుల డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో రిత్విక్‌ చౌదరీ (భారత్‌)–నికోలస్‌ బారింటోస్‌ (కొలంబియా) ద్వయం 7–6 (7/4), 7–6 (7/5)తో రొంబోలి–జొర్మాన్‌ (బ్రెజిల్‌) జంటపై గెలిచింది. 

1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్‌–బారింటోస్‌ జోడీ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. రెండు సెట్‌లలోటైబ్రేక్‌లో రిత్విక్‌–బారింటోస్‌ ద్వయం పైచేయి సాధించింది. 

ఇదే టోర్నీలో ఆడుతున్న శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–మిగెల్‌ రేయస్‌ వరేలా (మెక్సికో) జంట కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో నాలుగో సీడ్‌ బాలాజీ–వరేలా ద్వయం 3–6, 6–2, 10–4తో లెర్నర్‌ టియెన్‌–ఈథన్‌ క్విన్‌ (అమెరికా) జంటపై గెలిచింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement