మను భాకర్‌కు విశ్రాంతి | Rest to Manu Bhaker | Sakshi
Sakshi News home page

మను భాకర్‌కు విశ్రాంతి

Sep 13 2024 4:18 AM | Updated on Sep 13 2024 4:18 AM

Rest to Manu Bhaker

ప్రపంచకప్‌ షూటింగ్‌ ఫైనల్‌ టోర్నీకి భారత జట్టు ఎంపిక  

న్యూఢిల్లీ: వచ్చే నెల భారత్‌లో జరిగే సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో మను భాకర్‌ పాల్గొనడం లేదు. ఆమె మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. 

జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) గురువారం 23 మంది సభ్యుల భారత షూటింగ్‌ జట్టును ఎంపిక చేసింది. ఇందులో పారిస్‌కు వెళ్లొచ్చిన తొమ్మిది మంది షూటర్లున్నారు. అయితే మొత్తం 23 మందిలో ఒక్క రిథమ్‌ సాంగ్వాన్‌ మాత్రమే రెండు ఈవెంట్లలో పోటీపడనుంది. ఆమె మహిళల 10 మీటర్ల, 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్లలో తలపడుతుంది. 

మిగతా వారంతా ఒక ఈవెంట్‌కే పరిమితం కానున్నారు. వచ్చే నెల 13 నుంచి 18 వరకు ఢిల్లీలోని డాక్టర్‌ కర్ణి సింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో ప్రపంచకప్‌ షూటింగ్‌ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement