
ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ యువ స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ సంచలనం సృష్టించాడు. శుక్రవారం ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా లంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల ఫర్హాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన ఫర్హాన్ అహ్మద్.. ఆఖరి మూడు బంతుల్లో వరుసగా ల్యూక్ వుడ్, టామ్ ఆస్పిన్‌వాల్, మిచెల్ స్టాన్లేలను పెవిలియన్‌కు పంపాడు.
దీంతో అతడి ఖాతాలో తొలి హ్యాట్రిక్ చేరింది. అంతేకాకుండా టీ20 క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా అతడు రికార్డు సాధించాడు. ఈ ఫర్హాన్ ఎవరో కాదు, ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ ఆహ్మద్ తమ్ముడే.
గతేడాది జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో కూడా ఫర్హాన్ ఇంగ్లండ్ తరపున ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ యువ సంచలనం ఇప్పటికే నాటింగ్‌హామ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ 126 పరుగులకు ఆలౌటైంది. నాటింగ్‌హామ్ బౌలర్లలో ఫర్హాన్‌తో పాటు మోంట్‌గోమేరీ,ప్యాటర్సన్-వైట్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని నాటింగ్‌హామ్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది.
చదవండి: IND vs ENG: టీమిండియాతో నాలుగో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జో రూట్
FARHAN AHMED HAS A VITALITY BLAST HAT-TRICK AT 17 YEARS OLD!!!!! 😱 pic.twitter.com/dTThC98cwB
— Vitality Blast (@VitalityBlast) July 18, 2025