ఐపీఎల్‌-2024కు రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం | Sakshi
Sakshi News home page

IPL 2024: ఐపీఎల్‌-2024కు రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం

Published Sun, Nov 26 2023 8:39 AM

Rajasthan Royals Joe Root Opts Out Of Indian Premier League 2024 - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు రాజస్తాన్‌ రాయల్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ జట్టు స్టార్‌ బ్యాటర్‌, ఇంగ్లండ్‌ సీనియర్‌ ఆటగాడు జో రూట్‌ ఐపీఎల్‌-2024 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ శనివారం ధృవీకరించింది. రూట్‌ గత సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2023 వేలంలో అతడిని రూ. కోటి రూపాయల కనీస ధరకు రాజస్తాన్‌ కొనుగోలు చేసింది.

అయితే తన డెబ్యూ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే రూట్‌ ఆడాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. ఆ మ్యాచ్‌లో రూట్‌ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా కూడా రూట్‌ తన సేవలందించాడు.

జో రూట్‌ ఐపీఎల్‌-2024లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. మా ఆటగాళ్ల రిటేన్షన్‌ను జాబితాను సిద్దం చేసే క్రమంలో అతడు తన నిర్ణయాన్ని మాకు తెలియజేశాడు. అతడు మా జట్టుతో కేవలం ఒక్క సీజన్‌ మాత్రమే ఆడినప్పటికీ.. మా ఫ్రాంచైజీలో ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్నాడు.

మేము కచ్చితంగా అతడి అనుభవాన్ని, ఎనర్జీని మిస్‌ అవుతాం. ఏదైనప్పటికి అతని నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాము. అతడు తన కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము అని రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024 మినీ వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంచైజీలు తమ అంటిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను నవంబర్‌ 26 సాయంత్రం లోపు బీసీసీఐకి అందజేయాల్సి ఉంది.
చదవండిIPL 2024: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్యా.. ఆ విలువ ఎంత?

 
Advertisement
 
Advertisement