PV Sindhu: సింధు శుభారంభం | PV Sindhu Enters Pre Quarters In Canada Open World Tour 2023 | Sakshi
Sakshi News home page

PV Sindhu: సింధు శుభారంభం

Jul 7 2023 10:32 AM | Updated on Jul 7 2023 11:17 AM

PV Sindhu Enters Pre Quarters In Canada Open World Tour 2023 - Sakshi

కాల్గరీ: కెనడా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్‌ సింధు 21–16, 21–9తో తాలియా ఎన్‌జీ (కెనడా)పై విజయం సాధించింది.

మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 12–21, 3–21తో సుపనిద కటెథోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. లక్ష్య సేన్‌ 21–18, 21–15తో రెండో సీడ్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)ను బోల్తా కొట్టించగా... సాయిప్రణీత్‌ 12–21, 17–21తో వైగోర్‌ కొల్హో (బ్రెజిల్‌) చేతిలో ఓడిపోయాడు.   

మనిక ముందంజ 
లుబ్లియానా (స్లొవేనియా): ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌  స్టార్‌ కంటెండర్‌ లుబ్లియానా టోరీ్న లో భారత నంబర్‌వన్‌ మనిక బత్రా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో మనిక 11–4, 11–9, 11–7తో ప్రపంచ 15వ ర్యాంకర్‌ చెంగ్‌ ఐ చింగ్‌ (చైనీస్‌ తైపీ)పై సంచలన విజయం సాధించింది. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయింది. క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో శ్రీజ 9–11, 8–11, 11–9, 9–11తో భారత సంతతికి చెందిన ఫ్రాన్స్‌ క్రీడాకారిణి ప్రీతిక చేతిలో ఓడిపోయింది.  

Advertisement
 
Advertisement
Advertisement