పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ కీల‌క పోరు.. యువ ఆట‌గాడు అరంగేట్రం | IPL 2024: Punjab Kings opt to bowl in must-win tie against RCB | Sakshi
Sakshi News home page

IPL 2024: పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ కీల‌క పోరు.. యువ ఆట‌గాడు అరంగేట్రం

May 9 2024 7:23 PM | Updated on May 9 2024 7:56 PM

IPL 2024: Punjab Kings opt to bowl in must-win tie against RCB

ఐపీఎల్‌-2024లో మ‌రో కీల‌క పోరుకు రంగం సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు తల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌తో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున విద్వాత్ కవేరప్ప ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు పంజాబ్ స్టార్ పేస‌ర్ ర‌బాడ దూర‌మ‌య్యాడు. 

అత‌డి స్ధానంలో లియామ్ లివింగ్‌స్టోన్ తుది జ‌ట్టులో వ‌చ్చాడు. మ‌రోవైపు ఆర్సీబీ ఒకే ఒక మార్పు చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్ స్ధానంలో  లాకీ ఫెర్గూసన్ జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చాడు. ఇక ప్లే ఆఫ్ రేసులో నిల‌బ‌డాలంటే ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు చాలా కీల‌కం.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్

పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో(వికెట్ కీప‌ర్‌), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలీ రోసోవ్, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కావరప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement