విహారయాత్రలో టీమిండియా క్రికెటర్లు.. ఫోటో వైరల్‌ | Pujara Relaxes With Teammates Serene Location Ahead SA Test Series | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో టీమిండియా క్రికెటర్లు.. ఫోటో వైరల్‌

Dec 22 2021 8:47 PM | Updated on Dec 22 2021 8:50 PM

Pujara Relaxes With Teammates Serene Location Ahead SA Test Series - Sakshi

టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా తన సహచరులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. మూడు టెస్టులు.. మూడు వన్డేలు ఆడేందుకు భారత్‌ సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్‌ 26 నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు చిన్నపాటి టూర్‌కు వెళ్లినట్లు పుజారా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి పుజారా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫోటోలను షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో పుజారాతో పాటు అజింక్యా రహానే, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌లు ఉన్నారు. ''మాకు బుధవారం ఒక ఆదివారంలా అనిపించింది..'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

ఇక సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంతవరకు టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది. ప్రతీసారి ఎన్నో ఆశలతో ప్రొటీస్‌ గడ్డపై అడుగుపెట్టే టీమిండియా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక 2018లో చివరిసారి సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్‌ 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. 1991 నుంచి చూసుకుంటే సౌతాఫ్రికా, భారత్‌ల మధ్య  ఇప్పటివరకు 39 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో టీమిండియా 14 విజయాలు నమోదు చేయగా.. సౌతాఫ్రికా 15 విజయాలు అందుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement