బాబర్‌ ఆజమ్‌ పరుగుల ప్రవాహం కొనసాగింపు | PSL 2024 PZ VS QG: Babar Azam Scored Yet Another 50 | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజమ్‌ పరుగుల ప్రవాహం కొనసాగింపు

Mar 8 2024 8:57 PM | Updated on Mar 9 2024 2:40 AM

PSL 2024 PZ VS QG: Babar Azam Scored Yet Another 50 - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో పెషావర్‌ జల్మీ సారధి బాబర్‌ ఆజమ్‌ పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్న బాబర్‌.. తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో హాఫ్‌ సెంచరీ చేసి తన పరుగుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. క్వెట్టతో జరుగుతున్న మ్యాచ్‌లో 30 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 53 పరుగులు చేసిన బాబర్‌.. ప్రస్తుత ఎడిషన్‌లో తన పరుగుల సంఖ్యను 447కి పెంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌.. సెంచరీ, 4 అర్దసెంచరీలు చేశాడు. 

క్వెట్టాతో మ్యాచ్‌లో బాబర్‌ రాణించడంతో పెషావర్‌ జల్మీ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తుంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 156 పరుగులుగా ఉంది. జల్మీ ఇన్నింగ్స్‌లో బాబర్‌తో పాటు సైమ్‌ అయూబ్‌ (12 బంతుల్లో 30), మొహమ్మద్‌ హరీస్‌ (13 బంతుల్లో 20), కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ (19 బంతుల్లో 33) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. రోవ్‌మన్‌ పావెల్‌ (6), ఆమెర్‌ జమాల్‌ (5) క్రీజ్‌లో కొనసాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement