పీలే జెర్సీకి రూ. 47 కోట్లు | Pele jersey sold at auction for Rs 47 crores | Sakshi
Sakshi News home page

పీలే జెర్సీకి రూ. 47 కోట్లు

Jul 18 2026 3:36 AM | Updated on Jul 18 2026 3:36 AM

Pele jersey sold at auction for Rs 47 crores

న్యూయార్క్‌: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే జెర్సీకి భారీ ధర పలికింది. స్వీడన్‌ ఆతిథ్యమిచ్చిన 1958 ప్రపంచకప్‌ ఫైనల్లో బ్రెజిల్‌ 5–2 గోల్స్‌తేడాతో స్వీడన్‌ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. టైటిల్‌ పోరులో పీలే జెర్సీ నంబర్‌–10 ధరించి బరిలోకి దిగి రెండు గోల్స్‌ కూడా సాధించాడు. 1958 ఫైనల్లో పీలే ధరించి ఆడిన జెర్సీని న్యూయార్క్‌లోని ఆన్‌లైన్‌ వేలం సంస్థ సోథెబై వేలానికి పెట్టింది. వేలంలో ఓ అజ్ఞాత అభిమాని పీలే జెర్సీని 49 లక్షల డాలర్లకు (రూ. 47 కోట్లు) సొంతం చేసుకున్నాడు. 

2022లో మృతి చెందిన పీలే 1958, 1962, 1970 ప్రపంచకప్‌ టైటిల్స్‌ గెలిచిన బ్రెజిల్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గాయం కారణంగా పీలే 1962 ఫైనల్లో ఆడలేదు. 1958 జట్టు సహచరుడు దీదాకు పీలే తన జెర్సీని బహుమానంగా ఇచ్చాడు. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు ఈ జెర్సీ దీదా కుటుంబసభ్యులతో ఉంది. 2004లో బ్రెజిల్‌ మ్యూజియం అధికారులు దీనిని తీసుకోగా.. ఆ తర్వాత వేరే వ్యక్తులు దీనిని తమ సొంతం చేసుకొని చివరకు వేలంలో పెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement