వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత | Legendary West Indies Cricketer Garry Sobers Dies At 89, Remembered For Historic Records | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత

Jul 17 2026 8:56 PM | Updated on Jul 18 2026 11:20 AM

Legendary West Indies cricketer Garry Sobers dies at 89

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ (89) కన్నుమూశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబర్చిన సోబర్స్ మృతి క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.

1953లో కేవలం 16 ఏళ్ల వయసులో బార్బడోస్ తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన సోబర్స్, మరుసటి ఏడాదే వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 1958లో పాకిస్థాన్‌పై అజేయంగా 365 పరుగులు చేసి అప్పటికి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును 1994లో మరో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అధిగమించాడు.

1968లో వేల్స్‌లోని స్వాన్సీలో గ్లామోర్గన్‌పై జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు వరుస సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా సోబర్స్ చరిత్ర సృష్టించారు. ఆ ఘనత ఆయన కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది.

1974లో 38 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సోబర్స్, తన కెరీర్‌లో 93 టెస్టులు ఆడి  8032 పరుగులు (సగటు 57.78) చేసి 235 వికెట్లు తీశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 383 మ్యాచ్‌ల్లో 28 వేలకుపైగా పరుగులు, 1000కు పైగా వికెట్లు సాధించారు.

క్రికెట్‌కు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్‌హుడ్ (Sir) బిరుదును ప్రదానం చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement