రూ.కోట్లకు కత్తెర! | ₹2.61 Crore Power Equipment Purchase Without Tenders Sparks Controversy In Telangana Discom | Sakshi
Sakshi News home page

రూ.కోట్లకు కత్తెర!

Jun 30 2026 12:19 PM | Updated on Jun 30 2026 12:48 PM

Tender Notification From The Southern Telangana Electricity Organization

టెండర్‌ లేకుండానే రూ.2.61 కోట్లు

గ్రేటర్‌ పరిధి ‘డిస్కం’లో అక్రమాలు

చెట్ల కొమ్మల కత్తిరింపు యంత్రాల కొనుగోలు

బహిరంగ మార్కెట్‌లో కంటే భారీగా చెల్లింపులు

చెట్ల కొమ్మలు కత్తిరించే పరికరం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యాలయంలో గుండు పిన్ను కొనాలన్నా టెండర్‌ పిలుస్తుంటారు. తక్కువ కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌/సప్లయర్స్‌కు ఆ పరికరాల సరఫరా బాధ్యతను అప్పగిస్తుంటారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో మాత్రం అత్యవసరం పేరుతో టెండర్‌ నోటిఫికేషన్‌ లేకుండానే రూ.2.61 కోట్ల విలువ చేసే 59 చైన్‌సా, 168 పోల్‌ ప్రూనర్‌ విత్‌ అడిíÙనల్‌ బ్యాటరీ, 530 హ్యాండిల్‌ ట్రి ఫ్రూనర్‌ విత్‌ అడిíÙనల్‌ యంత్రాలను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది.

నిబంధనలు తుంగలోకి..
గ్రేటర్‌లో ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్ల కింద పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నాయి. ఈదురు గాలుల వర్షాలతో చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తలెత్తుతోంది.  చెట్లు, కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటంతో వాటిని తొలగించేందుకు పెద్ద సంఖ్యలో కూలీలను వినియోగించాల్సి వస్తోంది. కూలీలు గొడ్డళ్లతో కొమ్మలను నరకడం ఆలస్యమై గంటల కొద్దీ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండటంతో వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు లైన్లపై పడిన చెట్ల కొమ్మల సత్వర తొలగింపు పేరుతో యాజమాన్యం ఏకంగా నిబంధనలను తుంగలో తొక్కింది. చిన్న చిన్న సివిల్‌ పనులు, విద్యుత్‌ మెటిరీయల్‌ కొనుగోలుకు టెండర్లు పిలిచే అధికారులు.. ముఖ్యమైన ఈ యంత్రాల కొనుగోలు విషయంలో ఈ అంశాన్ని విస్మ రించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు నామినేషన్‌ పద్ధతిలో రూ.10 లక్షల లోపు విద్యుత్‌ పరికరాలు కొనుగోలు చేసే అధికారం ఉంది. రూ.కోటి విలువైన పరికరాలు కొనుగోలు చేయాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి. కానీ.. డిస్కం సీఎండీ ఏకంగా రూ.2.61 కోట్ల విలువ చేసే కీలకమైన యంత్రాలను నామినేషన్‌ పద్ధతిలో కొనుగోలు చేయడం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ‘చైన్‌ సా ఖరీదు రూ.20 వేల లోపు ఉండగా.. డిస్కం తన బినామీ ఏజెన్సీకి ఏకంగా రూ.51 వేలు చెల్లించింది. ఇక పోల్‌ ప్రూనర్‌ విత్‌ అడిíÙనల్‌ బ్యాటరీ పరికరం రూ.45 వేలలోపు ఉండగా, డిస్కం ఏకంగా రూ.78,940 చెల్లించింది. రూ.16 వేలలోపు దొరికే ఒక్కో హ్యాండిల్‌ ట్రీ ప్రూనర్‌ విత్‌ అడిíÙనల్‌ బ్యాటరీకి రూ.18,549 చెల్లించడం గమనార్హం.

ఏకపక్షంగా కొనుగోలు.. 
ఏకంగా రూ.2.61 కోట్లకుపైగా విలువ చేసే యంత్ర పరికరాలను టెండర్లు లేకుండా, మార్కెట్‌లో కంపెనీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను, నాణ్యత, పనితీరును పరిశీలించకుండా ఏకపక్షంగా నామినేషన్‌ పద్ధతిలో యంత్రాలను కొనుగోలు చేయడంతో సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement