మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఆడనున్న సన్‌రైజర్స్‌ కెప్టెన్‌.. Pat Cummins is set to play for San Francisco Unicorns in the upcoming MLC 2024. Sakshi
Sakshi News home page

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఆడనున్న సన్‌రైజర్స్‌ కెప్టెన్‌..

Jun 3 2024 7:26 AM | Updated on Jun 3 2024 11:34 AM

Pat Cummins set to play for San Francisco Unicorns in MLC

ఆస్ట్రేలియా  కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజ‌న్‌లో ఆడేందుకు శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ ఫ్రాంచైజీతో కమ్మిన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రన్నరప్‌గా నిలిపిన కమ్మిన్స్‌కు.. ఈ ఏడాది ఎంఎల్‌సీ(MLC) సీజన్‌లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్‌ ఉంది. 

గత సీజన్‌లో శాన్ ఫ్రాన్సిస్కోకు సారథ్యం వహించిన ఆరోన్‌ ఫించ్‌ రిటైర్మెంట్‌ అనంతరం.. ఆ జట్టు కెప్టెన్సీ పదవి ఇంకా ఖాళీగానే ఉంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్‌తో శాన్ ఫ్రాన్సిస్కో ఫ్రాంచైజీ కమ్మిన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 

కమ్మిన్స్‌కు కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. తన సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియాకు కమ్మిన్స్‌ వరుసగా డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్స్‌ను అందించాడు. ఈ క్రమంలోనే లీగ్‌ క్రికెట్‌లో పలు ఫ్రాంచైజీలు అతడికి పగ్గాలు అప్పగించేందుకు క్యూ కడుతున్నాయి.

ఇక ఈ ఏడాది మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఇప్పటికే చాలా మంది ఆసీస్‌ ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదర్చుకున్నారు. ట్రావిస్‌ హెడ్‌, మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, తన్వీర్‌ సంగా, మోసస్‌ హెన్రిక్స్‌ , బెన్‌ డ్వార్షుయిస్‌, జోష్‌ ఫిలిప్‌ లాంటి ఆసీస్‌ ఆటగాళ్లు  వాషింగ్టన్‌ ఫ్రీడం ఫ్రాంచైజీతో తరపున ఆడనున్నారు. 

అదే విధంగా ఆడమ్‌ జంపా, స్పెన్సర్‌ జాన్సన్‌ లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌రైడర్స్‌కు.. టిమ్‌ డేవిడ్‌ ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. జూలై 2 నుంచి ఎంఎల్‌సీ సెకెండ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది.
చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు నేను రెడీ: గంభీర్‌
 

Advertisement
 
Advertisement
Advertisement