AFG vs IND: ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్‌.. భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్‌ ఎంట్రీ

No Virat Kohli, Rohit Sharma for IND vs AFG series: Reports - Sakshi

వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసిన అనంతరం భారత జట్టు.. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.  కాగా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్‌ జరుగుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ బీసీసీఐ మాత్రం ఈ సిరీస్‌ను నిర్వహించాలని మెగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్‌ కమిటీ పడినట్లు పలునివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లకు రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు పీటీఐ తన రిపోర్టులో పేర్కొంది.

భారత జూనియర్‌ జట్టును సెలకర్లు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్సీ పగ్గాలు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు అప్పజెప్పే ఛాన్స్‌ ఉంది. అదే విధంగా ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్గాన్‌ సిరీస్‌కు జైశ్వాల్‌ సెలక్టర్లు ఎంపిక చేసే ఛాన్స్‌ ఉంది అని క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా సీఎస్‌కే తరపున దుమ్మురేపుతున్న ఓపెనర్‌ రుత్‌రాజ్‌కు గైక్వాడ్‌కు కూడా సెలక్టర్లు పిలుపునివ్వనున్నట్లు సమాచారం. ఇక ఆఫ్గాన్‌ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్‌ జాన్‌ మధ్యలో జరిగే ఛాన్స్‌ ఉంది. ఈ సిరీస్‌ ముగిసిన అనంతరం భారత జట్టు విండీస్‌ పర్యటనకు వెళ్లనుంది.
చదవండి: IPL 2023: ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం అభిమానులు అవస్థలు.. స్టేడియం వద్ద తొక్కిసలాట!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top