పూరన్‌ విధ్వంసం.. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భారీ స్కోర్‌ Nicholas Poorans Powers West Indies at 218-5 after 20 overs. Sakshi
Sakshi News home page

WI vs AFG: పూరన్‌ విధ్వంసం.. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భారీ స్కోర్‌

Jun 18 2024 8:04 AM | Updated on Jun 18 2024 9:21 AM

Nicholas Poorans Powers West Indies at 218-5 after 20 overs

టీ20 వరల్డ్‌కప్‌-2024లో వెస్టిండీస్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో జూలు విదిల్చింది. సెయింట్‌ లూసియా వేదికగా గ్రూపు-సిలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్లు అదరగొట్టారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. విండీస్‌ బ్యాటర్లలో నికోలస్‌ పూరన్‌ విధ్వంసం సృష్టించాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని పూరన్‌ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్‌ 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.

ఇక అతడితో పాటు చార్లెస్‌(43), హోప్‌(25), పావెల్‌(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్‌ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్‌ ఉల్‌ హాక్‌ తలా వికెట్‌ సాధించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement