నికోలస్‌ పూరన్‌ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన వెస్టిండీస్‌ | Nicholas Pooran powers West Indies to a thumping win over South Africa | Sakshi
Sakshi News home page

WI vs SA: నికోలస్‌ పూరన్‌ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన వెస్టిండీస్‌

Aug 24 2024 11:40 AM | Updated on Aug 24 2024 11:52 AM

Nicholas Pooran powers West Indies to a thumping win over South Africa

ద‌క్షిణాఫ్రికాతో మూడు టీ20ల‌ సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విండీస్ ఘ‌న విజ‌యం సాధించింది. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని కరేబియన్లు ఊదిపడేశారు. 

17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విండీస్‌ ఛేదించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్‌ ఓపెనర్లు అలిక్‌ అథ్‌నాజ్‌(40), షాయ్‌ హోప్‌(51) పరుగులతో అద్బుత ఆరంభాన్ని అందిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 

కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్‌.. 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో బార్టమన్‌ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.

రాణించిన స్టబ్స్‌..
అంతకముందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌(76) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో పట్రిక్‌ కుర్గర్‌(44) పర్వాలేదన్పించాడు.

 విండీస్‌ బౌలర్లలో ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్‌ రెండు, అకిల్‌ హోస్సేన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 25న ట్రినిడాడ్‌ వేదికగానే జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement