విధ్వంసం సృష్టించిన పూరన్‌ | Nicholas Pooran Leads Superchargers To Victory In The Hundred League 2024 | Sakshi
Sakshi News home page

విధ్వంసం సృష్టించిన పూరన్‌

Jul 31 2024 12:02 PM | Updated on Jul 31 2024 12:24 PM

Nicholas Pooran Leads Superchargers To Victory In The Hundred League 2024

హండ్రెడ్‌ లీగ్‌లో భాగంగా సథరన్‌ బ్రేవ్‌తో నిన్న (జులై 30) జరిగిన మ్యాచ్‌లో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సథరన్‌ బ్రేవ్‌.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అలెక్స్‌ డేవిస్‌ (28), జేమ్స్‌ కోల్స్‌ (26), కీరన్‌ పోలార్డ్‌ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూపర్‌ ఛార్జర్స్‌ బౌలర్లలో పార్కిన్సన్‌ 2, జోర్డన్‌ క్లార్క్‌, పాట్స్‌, సాంట్నర్‌, ఆదిల్‌ రషీద్‌, షార్ట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌ ఛార్జర్స్‌.. నికోలస్‌ పూరన్‌ విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో (34 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడటంతో 85 బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. హ్యారీ బ్రూక్‌ (20 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. సథరన్‌ బ్రేవ్‌ బౌలర్లలో అకీల్‌ హొసేన్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ జోర్డన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌, సథరన్‌ బ్రేవ్‌ మధ్య నిన్న జరిగిన మహిళల హండ్రెడ్‌ లీగ్‌ మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇరు జట్లు నిర్ణీత 100 బంతుల్లో 100 పరుగులు చేశారు. హండ్రెడ్‌ లీగ్‌లో సూపర్‌ ఓవర్‌ రూల్‌ లేకపోవడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement