టీ20 ప్రపంచకప్-2026కు ముందు అఫ్గానిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ గాయం కారణగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. నవీన్ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాడు.
అయితే వరల్డ్‌కప్ సమయానికి అతడు కోలుకుంటాడని జట్టులో సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడి గాయం తీవ్రత మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నెలాఖరులో తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం.
ఈ కారణంతోనే వరల్డ్‌కప్‌తో పాటు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరి కొన్ని నెలల పట్టనున్నట్లు అఫ్గాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఆసియాకప్-2025కు కూడా దూరంగా ఉన్నాడు. కాగా నవీన్ స్దానంలో ఇంకా అధికారికంగా ఎవరినీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ, అల్లా గజన్ఫర్ లేదా ఇజాజ్ అహ్మద్‌జాయ్‌లలో ఒకరు ప్రధాన జట్టులోకి వచ్చే అవకాశముంది.
టీ20 ప్రపంచ కప్ 2026కు అఫ్గాన్ జట్టు:
రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సెడిఖుల్లా అటల్, ఫజల్‌హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా, రమ్‌మానులీ, రమ్‌మతుల్లా, ఉమర్‌జాయి, జద్రాన్. రిజర్వ్‌లు: అల్లా ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్ మరియు జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ
చదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు


