
ఆసియాకప్-2023ను ఆఫ్గానిస్తాన్ ఓటమితో ఆరంభించింది. లహోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ఓపెనర్ మెహదీ హసన్ మిరాజ్ (119 బంతుల్లో 112 రిటైర్డ్‌హర్ట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిడిలార్డర్‌లో నజ్ముల్ హోసేన్ షాంతో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు.
అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్, గుల్బదిన్ చెరో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (74), కెపె్టన్ హష్మతుల్లా ( 51) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు.
ఇక ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రహ్మాన్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. హిట్‌వికెట్‌గా ముజీబ్ పెవిలియన్‌కు చేరాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 45 ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ముజీబ్ భారీ షాట్ ఆడాడు. దెబ్బకు బంతి స్టాండ్స్‌కు వెళ్లింది. కానీ ఇక్కడే అస్సలు ట్విస్టు చోటుచేసుకుంది.
బంతిని కొట్టి క్రమంలో ముజీబ్ తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. ఇది గమనించిన వికెట్ కీపర్ రహీమ్ ఔట్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు కూడా సంబరాలు మునిగి తెలిపోయారు. పాపం ముజీబ్ సిక్స్ కొట్టి మరి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కాగా ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. తద్వారా అత్యంత చెత్త రికార్డును ఒకటి ముజీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్ నిలిచాడు.
చదవండి: వరుణుడు కరుణిస్తే!
Mujeeb rehman got out by hit wicket but ball went to six 😃😃#AsiaCup #CricketTwitter #sundayvibes #ICC pic.twitter.com/KSKwI7DiXf
— Abhishek Salian (@Abhishe76586692) September 3, 2023