చ‌రిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే | Mohammed Shami Creates History: Becomes First Bowler In IPL | Sakshi
Sakshi News home page

IPL 2025: చ‌రిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే

Apr 25 2025 10:08 PM | Updated on Apr 25 2025 10:08 PM

Mohammed Shami Creates History: Becomes First Bowler In IPL

PC: BCCI/IPL.com

టీమిండియా స్టార్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధిక సార్లు వికెట్ తీసిన బౌలర్‌గా షమీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ రషీద్‌ను మొదటి బంతికే ఔట్ చేసిన షమీ.. ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు.

షమీ ఇప్పటివరకు ఇన్నింగ్స్ మొదటి బంతికి నాలుగు సార్లు వికెట్ సాధించాడు.  జాక్వెస్ కాలిస్, కెఎల్ రాహుల్,ఫిల్ సాల్ట్, షేక్ రషీద్‌లను తొలి బంతికే షమీ ఔట్ చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పేరిట ఉండేది. బౌల్ట్ మూడు సార్లు మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. 

తాజా మ్యాచ్‌తో బౌల్ట్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే షమీ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమవుతున్నాడు. భారీగా పరుగులు సమర్పించుకుని జట్టుకు భారంగా మారుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. 28 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.

ఇ​క ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.5 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో డెవాల్డ్ బ్రెవిస్‌(42) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మాత్రే(30), ర‌వీంద్ర జ‌డేజా(21) రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప్యాట్ క‌మ్మిన్స్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ త‌లా రెండు వికెట్లు సాధించారు. సీఎస్‌కే కెప్టెన్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.
చ‌ద‌వండి: విరాట్ కోహ్లి తొంద‌ర‌ప‌డ్డాడు.. అప్ప‌టి వ‌ర‌కు ఆడాల్సింది: సురేష్ రైనా
 

Advertisement
 
Advertisement
Advertisement