
అంతర్జాతీయ వన్డేల్లో సౌతాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) తన అద్బుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బ్రీట్జ్కే మరోసారి దుమ్ములేపాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ప్రోటీస్‌ను మార్‌క్రమ్‌తో కలిసి ఈ యువ ఆటగాడు ఆదుకున్నాడు. కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు.
ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ఇక ఈ మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీతో మెరిసిన బ్రీట్జ్కే ప్రపంచ రికార్డును సాధించాడు. వన్డేల్లో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు వన్డేల్లో ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.
పాకిస్తాన్ వేదికగా జరిగిన ట్రై సిరీస్‌లో కివీస్ జట్టుతో మ్యాచ్‌లో వన్డే అరంగేట్రం చేసిన .. 148 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. తద్వారా వన్డే అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అనంతరం పాకిస్తాన్‌తో వన్డేలో 83 పరుగులు చేశాడు బ్రీట్జ్కే.
తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 57 పరుగులు సాధించిన బ్రీట్జ్కే.. రెండో వన్డేలో 88 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 88 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు తను ఆడిన ఐదు వన్డేల్లో 463 పరుగులు చేశాడు.
తద్వారా తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ ఆటగాడు టామ్ కూపర్(374) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కూపర్ రికార్డును మాథ్యూ బ్రేక్ చేశాడు.