'శుబ్‌మ‌న్ గిల్ ఒక అద్బుతం'.. యూట‌ర్న్ తీసుకున్న భార‌త మాజీ క్రికెట‌ర్‌ | Manjrekar makes U-turn on captain Gill after century in Leeds | Sakshi
Sakshi News home page

IND vs ENG: 'శుబ్‌మ‌న్ గిల్ ఒక అద్బుతం'.. యూట‌ర్న్ తీసుకున్న భార‌త మాజీ క్రికెట‌ర్‌

Jun 21 2025 4:40 PM | Updated on Jun 21 2025 7:21 PM

Manjrekar makes U-turn on captain Gill after century in Leeds

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ త‌న తొలి మ్యాచ్‌లోనే స‌త్తాచాటాడు. లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో గిల్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. తొలి రోజు ఆటముగిసే స‌మ‌యానికి 127 ప‌రుగుల‌తో గిల్ అజేయంగా నిలిచాడు.

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై గిల్‌కు ఇదే మొద‌టి టెస్టు సెంచ‌రీ కావ‌డం గమ‌నార్హం. ఈ క్ర‌మంలో కెప్టెన్‌గా అత‌డిని ఎంపిక చేయ‌డాన్ని విమ‌ర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి. తొలుత‌ కెప్టెన్‌గా గిల్‌ను వ్య‌తిరేకించిన భార‌త క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ ఇప్పుడు ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్బుత‌మైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేశాడ‌ని మంజ్రేక‌ర్ కొనియాడాడు.

"కొన్ని రోజుల కింద‌ట భార‌త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక‌చేయ‌డాన్ని నేను వ్య‌తిరేకించాను. గిల్ కంటే జ‌స్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా బెటర్ అని అభిప్రాయ‌ప‌డ్డాను. ఆ స‌మ‌యంలో సెల‌క్ట‌ర్లు స‌రైన నిర్ణ‌యం తీసుకోలేద‌ని నేను చెప్పుకొచ్చాను. కానీ నేను ఎక్క‌డా కూడా గిల్ కెప్టెన్‌గా విఫ‌ల‌మ‌వుతాడ‌ని మాత్రం చెప్ప‌లేదు.

కెప్టెన్సీ భారం త‌న బ్యాటింగ్‌కు ప‌డ‌కుండా గిల్ చూసుకుంటాడ‌ని నేను ముందే ఊహించాను. కానీ విదేశాల్లో మాత్రం అత‌డి ప్ర‌ద‌ర్శ‌న ఇంకా మెరుగు ప‌డాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మాత్రం గిల్ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

శుబ్‌మ‌న్ త‌న బ్యాటింగ్‌లో టెక్నిక‌ల్ లోపాల‌ను స‌రిదిద్దుకున్నాడు. అందుకే విదేశీ గ‌డ్డ‌పై భారీ సెంచ‌రీసాధించ‌గ‌లిగాడని" జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంజ్రేక‌ర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌

Advertisement
 
Advertisement
Advertisement