న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ | India Squad For New Zealand ODIs, Tests Out | Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌

Oct 17 2026 12:00 AM | Updated on Oct 17 2026 12:34 AM

India Squad For New Zealand ODIs, Tests Out

PC: BCCI/X

న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్టును బీసీసీఐ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా సెల‌క్ట‌ర్లు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  తొలి మూడు వ‌న్డేలకు భార‌త జ‌ట్టు కెప్టెన్ వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా.. చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు. 

వ‌ర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని గిల్‌ను చివరి రెండు వన్డేల నుంచి తప్పించారు. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డేల నుంచి విశ్రాంతినిచ్చారు. అదేవిధంగా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుమార్ కుశాగ్రా తొలిసారి జాతీయ జ‌ట్టుకు ఎంపికయ్యాడు. 

చివరి రెండు వన్డేల కోసం అత‌డిని జ‌ట్టులోకి తీసుకున్నారు. ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ తొలి మూడు వన్డేలకు ఎంపిక చేసిన జ‌ట్టులో చోటు ద‌క్కింది. మ‌రోవైపు ఫాస్ట్ బౌల‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణను సెలక్ట్ చేసినప్పటికి అతడు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. అలాగే కివీస్‌తో ఈ ఐదు వన్డేల మెత్తానికి సీనియర్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అందుబాటులో ఉన్నారు.

ఆకాష్ దీప్ రీఎంట్రీ
ఇక భార‌త టెస్టు జ‌ట్టులోకి బెంగాల్ పేస‌ర్ ఆకాష్ దీప్ తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. అదేవిధంగా వన్డేలకు విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రాకు సైతం టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. అయితే గాయంతో బాధపడుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసినప్పటికీ, సిరీస్‌కు ముందు అతను ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసుకోవాల్సి ఉంది. న‌వంబ‌ర్ 4 నుంచి వ‌న్డే సిరీస్‌, నవంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే టీ20 జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది.
జట్ల వివరాలు:
తొలి మూడు వన్డేలకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ*, కుల్దీప్ యాదవ్.

నాలుగు, ఐదు వన్డేలకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్)*, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement