చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌ | Rishabh Pant Creates History, Overtakes Rohit Sharma In Huge WTC | Sakshi
Sakshi News home page

IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌

Jun 21 2025 3:46 PM | Updated on Jun 21 2025 5:04 PM

Rishabh Pant Creates History, Overtakes Rohit Sharma In Huge WTC

టెస్టు క్రికెట్‌లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ మ‌రోసారి త‌న స‌త్తా చాటాడు. లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో పంత్ ఫియ‌ర్‌లెస్ ఇన్నింగ్స్ ఆడాడు. య‌శ‌స్వి జైశ్వాల్ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన రిష‌బ్‌.. త‌నదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు.

మొద‌టి రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి పంత్ 65 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 6 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో పంత్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

హిట్‌మ్యాన్ రికార్డు బ్రేక్‌..
వ‌రల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. పంత్ ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 35 మ్యాచ్‌లు ఆడి 58 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ(56) పేరిట ఉండేది.

తాజా మ్యాచ్‌తో రోహిత్‌ను రిషబ్ అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌(83) అగ్రస్ధానంలో ఉండగా.. పంత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌(127 నాటౌట్‌), యశస్వి జైశ్వాల్‌(101) సెంచరీలతో మెరిశారు.
చదవండి: అలా అయితే అవుట్‌ అయిపోతావు! గిల్‌కు పంత్‌ వార్నింగ్‌.. వైరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement