WPL 2023: బాబర్ కంటే మంధానకి రెండున్నర రెట్లు ఎక్కువ.. పాక్‌ ప్లేయర్లు ఇప్పుడేమంటారో?

Mandhana set to earn more money than Pak captain after deal with RCB - Sakshi

ప్రపంచ క్రికెట్‌లో ఎన్ని టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లు పుట్టికొచ్చినా.. ఏదీ ఐపీఎల్‌కి సాటి రాదు. కాసుల వర్షం కురిపించే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో భాగం కావాలని ప్రతీ ఒక్కరూ కలలు కంటుంటారు. ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్ర ఐపీఎల్‌కు ఉంది.

కాగా కొంత మంది పాక్‌ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం ఐపీఎల్‌ కంటే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ బెటర్‌ అంటూ గొప్పలు పలుకుతుంటారు. అయితే బీసీసీఐ ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మరోసారి తేలిపోయింది. తాజాగా జరిగిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంతో ఇది మరోసారి రుజువైంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలంలో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా మంధాన నిలిచింది. రూ.3.4 కోట్ల భారీ ధరకు ఈ స్టార్‌ ఓపెనర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో  కెప్టెన్‌ బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది వంటి స్టార్‌ ఆటగాళ్లు కంటే మంధాన ఎక్కువ మొత్తాన్ని అందుకోవడం విశేషం.

బాబర్‌ కంటే ఎక్కువే..
పీఎస్‌ఎల్‌లో బాబర్‌ ఆజం ప్లాటినం కేటిగిరిలో ఉన్నాడు. ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకి పాకిస్తాన్‌ కరెన్సీలో 3.60 కోట్లు అందుతుంది. కాగా ఈ కేటగిరీ బాబర్‌ ఒక్కడే ఉండడం గమానర్హం. అంటే బాబర్‌ ఈ ఏడాది సీజన్‌కు గాను రూ. 3.60 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు.

బాబర్ అందుకునే మొత్తం రూ. 3 కోట్ల 60 లక్షలు... అదే భారత కరెన్సీలో వచ్చేసరికి రూ. కోటి 23 లక్షలు మాత్రమే. అంటే పీఎస్‌ఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న బాబర్  కంటే స్మృతి మంధాన రెండున్నరెట్లు ఎక్కువ మొత్తాన్ని మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా అందుకోబోతోంది. కాగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023 సోమవారం నుంచి ప్రారం‍భమైం‍ది.
చదవండిNZ Vs Eng: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. కీలక పేసర్‌ దూరం! సీఎస్‌కే కలవరం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top