సింధు ముందుకు.. సైనా ఇంటికి | Malaysia Open 2022: PV Sindhu Advances To Second Round, Saina Nehwal Crashes Out | Sakshi
Sakshi News home page

Malaysia Open 2022: సింధు ముందుకు.. సైనా ఇంటికి

Jun 29 2022 4:51 PM | Updated on Jun 30 2022 8:45 AM

Malaysia Open 2022: PV Sindhu Advances To Second Round, Saina Nehwal Crashes Out - Sakshi

మలేషియా ఓపెన్‌ 2022లో భారత్‌కు ఇవాళ (జూన్‌ 29) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌, ప్రపంచ 7వ ర్యాంకర్‌ పీవీ సింధు రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా.. 2012 ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది. వరల్డ్‌ నంబర్‌ 10 ప్లేయర్‌ పోన్‌పావీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)పై సింధు 21-13, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా.. అమెరికాకు చెందిన ఐరిస్‌ వాంగ్‌ చేతిలో 11-21, 17-21 తేడాతో సైనా ఓటమిపాలైంది. 

మరోవైపు డబుల్స్‌ పెయిర్‌ బి సుమీత్‌ రెడ్డి- అశ్విని పొన్నప్ప.. నెదర్లాండ్స్‌ జోడీ రాబిన్‌ టాబెలింగ్‌-సెలెనా పీక్‌ చేతిలో 15-21, 21-19 17-21 తేడాతో ఓటమిపాలవగా, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. ప్రణయ్‌.. స్థానిక ఆటగాడు ల్యూ డారెన్‌పై  21-14, 17-21, 21-18తేడాతో గెలుపొందాడు. 
చదవండి: 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు షాక్‌.. తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ
 

Advertisement
 
Advertisement
Advertisement