మెస్సి ఒక్కడే చాలు.. ఫుట్‌బాల్ ప్రపంచం షాక్‌ | Lionel Messi Scripts FIFA World Cup History | Sakshi
Sakshi News home page

మెస్సి ఒక్కడే చాలు.. ఫుట్‌బాల్ ప్రపంచం షాక్‌

Jun 23 2026 2:23 AM | Updated on Jun 23 2026 4:53 AM

Lionel Messi Scripts FIFA World Cup History

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ (18) చేసిన ఆటగాడిగా లియోనెల్ మెస్సి నిలిచాడు. కెప్టెన్‌గా రెండు గోల్స్ చేసి, సోమవారం అర్ధరాత్రి ఆస్ట్రియాపై అర్జెంటీనాకు 2-0 తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో అర్జెంటీనా నాకౌట్ దశలోని చివరి 32 జట్లలో ఒకటిగా అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక మ్యాచ్ ముగిసింది.

తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన మెస్సి.. ఈ మ్యాచ్‌లో మొదటి గోల్ చేయడంతో ప్రపంచకప్‌లో అతని మొత్తం గోల్స్ 17 అయ్యాయి. అంటే, తొలి మ్యాచ్‌లో అల్జీరియాపై మెస్సీ 3 గోల్స్ (హ్యాట్రిక్) చేశాడు. ఇప్పుడు ఆస్ట్రియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి గోల్ చేశాడు. దీంతో ప్రపంచకప్‌లో అతని మొత్తం గోల్స్ 16 నుంచి 17కు చేరాయి. ఆ తర్వాత మెస్సి మరో గోల్‌ చేయడంతో మొత్తం గోల్స్ 18కి చేరుకున్నాయి.

మ్యాచ్‌కు ముగింపు ఇలా.. 
మెస్సీ ఇంజరీ టైమ్ చివరలో రెండో గోల్ చేసి మ్యాచ్‌కు ముగింపు పలికాడు. బాక్స్‌లో జరిగిన గందరగోళం మధ్య ఫుట్‌బాల్‌ను అడ్డుకునేందుకు నిలిచిన నలుగురు డిఫెండర్లను దాటుకుని గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉండేదే. తొలి దశలో వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని అతను చేజార్చాడు. డల్లాస్ కౌబాయ్స్ స్టేడియంలో అర్జెంటీనాకు మద్దతుగా వచ్చిన 70,649 మంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. 

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉండటంతో రెండు జట్లు గట్టిగా పోరాడాయి. ఆస్ట్రియా అభిమానుల కంటే అధిక సంఖ్యలో వచ్చిన అర్జెంటీనా అభిమానులు తమ హీరో మెస్సికి నిలబడి అభినందనలు తెలిపారు. అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0తో విజయం సాధించిన సమయంలో హ్యాట్రిక్ చేసిన మెస్సీ.. గతంలో జర్మన్ ఆటగాడు మిరోస్లావ్ క్లోస్ ప్రపంచకప్‌లో చేసిన 16 గోల్స్ రికార్డును సమం చేశాడు. తొలి గోల్ తర్వాత మెస్సి భావోద్వేగానికి గురయ్యాడు. తర్వాత అతని తండ్రి ఆరోగ్య సమస్య నుంచి కోలుకుంటున్నట్టు తెలిసింది. ఆ ఆరోగ్య సమస్య ఏమిటన్న వివరాన్ని వెల్లడించలేదు.

మెస్సి నయా రికార్డ్‌ లెక్క ఇది.. 

  • తొలి మ్యాచ్‌లో అల్జీరియాపై హ్యాట్రిక్‌తో మెస్సి ప్రపంచకప్ కెరీర్ గోల్స్ 16 అయ్యాయి. దీంతో మిరోస్లావ్ క్లోస్ రికార్డును సమం చేశాడు.

  • ఇప్పుడు ఆస్ట్రియాపై మొదటి గోల్ చేయడంతో అతని ప్రపంచకప్ గోల్స్ 17 అయ్యాయి. దీంతో  మిరోస్లావ్ క్లోస్ రికార్డును అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పాడు.

  • ఇదే మ్యాచ్‌లో ఇంజరీ టైమ్‌లో మరో గోల్ కూడా చేశాడు. దీంతో అతని మొత్తం ప్రపంచకప్ గోల్స్ 18కు చేరాయి.
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement