దక్షిణాఫ్రికా పర్యటన.. భారత-ఏ జట్టు కెప్టెన్‌గా కేఎస్‌ భరత్‌ | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా పర్యటన.. భారత-ఏ జట్టు కెప్టెన్‌గా కేఎస్‌ భరత్‌

Published Fri, Dec 1 2023 8:34 AM

KS Bharat To Lead India A In South Africa - Sakshi

3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్‌ జట్టు డిసెంబర్‌ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్‌ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సీనియర్లు రోహిత్‌, విరాట్‌ దూరంగా ఉండనుండగా.. చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌,  వన్డేలకు కేఎల్‌ రాహుల్‌, టెస్ట్‌ జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకానుంది. 

కాగా, భారత సీనియర్‌ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగానే భారత-ఏ జట్టు కూడా పర్యటనలో భాగం కానుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు సౌతాఫ్రికా ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే సీనియర్‌ జట్టుతో ఓ ఇన్‌ట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ కూడా ఆడుతుంది. భారత ఏ జట్టుకు ఆంధ్ర వికెట్‌కీపర్‌ కేఎస్‌ భరత్‌ నాయకత్వం వహించనున్నాడు. సెంచూరియన్‌ వేదికగా జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు భారత-ఏ జట్టు తొలి నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడనుంది. అనంతరం భారత్‌ ఆడబోయే రెండో టెస్ట్‌కు ముందు రెండో మ్యాచ్‌ జరుగనుంది. 

తొలి మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో దేశవాలీ స్టార్‌ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌,సాయి సుదర్శన్‌లకు చోటు లభించింది.  రెండో మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో జాతీయ జట్టు ఆటగాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలకు అవకాశం లభించింది. 

తొలి నాలుగు రోజుల మ్యాచ్‌ కోసం భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ప్రదోష్ రంజన్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్‌ భరత్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, పుల్కిత్ నారంగ్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, తుషార్ దేశ్‌పాండే

రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎస్‌ భరత్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, నవదీప్ సైనీ

మూడు రోజుల ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్‌ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్‌ భరత్ , ధ్రువ్ జురెల్ , ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పుల్కిత్ నారంగ్, హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ

దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్‌ సింగ్, దీపక్ చాహర్.

సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్‌..

టీ20 సిరీస్‌..

డిసెంబర్‌ 10: తొలి టీ20 (డర్బన్‌)

డిసెంబర్‌ 12: రెండో టీ20 (పోర్ట్‌ ఎలిజబెత్‌)

డిసెంబర్‌ 14: మూడో టీ20 (జోహనెస్‌బర్గ్‌)

వన్డే సిరీస్‌..

డిసెంబర్‌ 17: తొలి వన్డే (జోహనెస్‌బర్గ్‌)

డిసెంబర్‌ 19: రెండో వన్డే (పోర్ట్‌ ఎలిజబెత్‌)

డిసెంబర్‌ 21: మూడో వన్డే (పార్ల్‌)

టెస్ట్‌ సిరీస్‌..

డిసెంబర్‌ 26 నుంచి 30: తొలి టెస్ట్‌ (సెంచూరియన్‌)

2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్‌ (కేప్‌టౌన్‌)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement