
వికెట్ కీపింగ్.. టెస్టు క్రికెట్‌లో టీమిండియాను వేదుస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటి. రిషబ్ పంత్ కారు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైనప్పటి నుంచి టీమిండియాలో తన లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. లోయర్డర్‌లో వచ్చి మెరుపులు మెరిపించే పంత్ స్ధానాన్ని ఇప్పటివరకు ఎవరూ భర్తీ చేయలేకపోయారు.
భరత్ అట్టర్ ప్లాప్
రిషబ్ పంత్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్.. వరుసగా విఫలమవుతున్నాడు. వికెట్ కీపింగ్ పరంగా కాస్త పర్వాలేదనప్పిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవతున్నాడు. కీలక సమయాల్లో బ్యాటింగ్‌కు వస్తున్న భరత్ ఒత్తడిని తట్టుకోలేక త్వరగా పెవిలియన్‌కు చేరుతున్నాడు. ఇటీవలే తన హోం గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులోనూ అదే ఆటతీరును భరత్ కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు.
కాగా ఇప్పటివరకు తన కెరీర్‌లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
దృవ్ జురల్ అరంగేట్రం!?
అతడి స్ధానంలో యవ వికెట్ కీపర్ దృవ్ జురల్‌కు అవకాశమివ్వాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. జురల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లోయార్డర్‌లో వచ్చి బ్యాటింగ్ చేసే సత్తా దృవ్‌కు ఉంది. జురల్ 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 790 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ