వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా తెలుగు తేజం | Koneru Humpy Wins World Rapid Championship 2024 | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా తెలుగు తేజం

Dec 29 2024 9:53 AM | Updated on Dec 29 2024 11:00 AM

Koneru Humpy Wins World Rapid Championship 2024

భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. న్యూయార్క్‌లోని వాల్‌ స్ట్రీట్‌లో ఇవాళ (డిసెంబర్‌ 29) జరిగిన 11వ రౌండ్‌లో హంపి ఐరీన్ సుకందర్‌ను ఓడించింది. ఈ టోర్నీలో మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019లో హంపి తొలిసారి వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ టైటిల్‌ను నెగ్గింది. హంపికి ముందు చైనాకు చెందిన జు వెంజున్ మాత్రమే వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిళ్లను ఒకటి కంటే ఎక్కువ సార్లు నెగ్గింది.

పురుషుల విభాగం విజేతగా..
వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ పురుషుల విభాగం విజేతగా రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ వోలోదర్ ముర్జిన్‌ నిలిచాడు. ముర్జిన్‌ 13 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు అగ్రస్థానంలో నిలిచిన అర్జున్‌.. చివరి రౌండ్లలో వెనుకపడిపోయాడు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement