ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కోనేరు హంపి | Koneru Hampi meets Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కోనేరు హంపి

Jan 4 2025 4:10 AM | Updated on Jan 4 2025 4:10 AM

Koneru Hampi meets Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. న్యూయార్క్‌లో జరిగిన మహిళల ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అయ్యింది. 

ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసలు కురిపించిన మోదీ... హంపి క్రీడా దిగ్గజమని కొనియాడారు. ‘హంపిలాంటి స్పోరి్టంగ్‌ ఐకాన్‌ను కలవడం ఆనందంగా ఉంది. చెస్‌ప్లేయర్లకు ఆమె ఒక స్ఫూర్తి. చురుకైన ఆలోచన, అచంచల సంకల్పం, నిబద్ధత వల్లే ఆమె ఈ స్థాయికి చేరుకుంది. దేశానికే ఆమె గర్వకారణం’ అని ప్రధాని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. 

మోదీతో భేటీ కావడం, ఆయన కురిపించిన ప్రశంసలు, ప్రోత్సహించిన తీరు తనలో నూతనోత్సహాన్ని నింపిందని హంపి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement