గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా క్లింగర్‌ | Klinger as the head coach of the Gujarat Giants team | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా క్లింగర్‌

Feb 7 2024 3:56 AM | Updated on Feb 7 2024 12:17 PM

Klinger as the head coach of the Gujarat Giants team - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో తలపడే గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుకు కొత్త హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్‌ క్లింగర్‌ను నియమించారు. తొలి సీజన్‌లో ఆస్ట్రేలియాకే చెందిన రాచెల్‌ హేన్స్‌ కోచింగ్‌లో బరిలోకి దిగిన జెయింట్స్‌ అట్టడుగున నిలిచింది.

2017లో ఆ్రస్టేలియా తరఫున మూడు అంతర్జాతీయ టి20 లు ఆడిన క్లింగర్‌ తదనంతరం మహిళల బిగ్‌బా‹Ùలో సిడ్నీ థండర్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేశారు. డబ్ల్యూపీఎల్‌–2 ఈ నెల 25న మొదలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement