KKR vs MI: కేకేఆర్‌తో ముంబై పోరు.. తుది జ‌ట్లు ఇవే | KKR Vs MI: Mumbai Indians Opt To Bowl First Against Kolkata Knight Riders, Details Inside | Sakshi
Sakshi News home page

KKR vs MI: కేకేఆర్‌తో ముంబై పోరు.. తుది జ‌ట్లు ఇవే

May 11 2024 9:51 PM | Updated on May 12 2024 7:27 PM

KKR vs MI: Mumbai Indians Opt to Bowl First Against Kolkata Knight Riders

ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌ను వర్షం కార‌ణంగా 16 ఓవ‌ర్ల‌కు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగ‌గా.. కోల్‌క‌తా ఓ మార్పు చేసింది. ర‌ఘువంశీ స్ధానంలో నితీష్ రానా వ‌చ్చాడు. ఇక వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాల‌ని భావిస్తోంది. 

11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌క‌తా.. ఎనిమిదింట విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు ముంబై అయితే ఇప్ప‌టికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో నిలిచింది.

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

Advertisement
 
Advertisement
Advertisement