క్రీడా–కళాకారులకు సరికొత్త వేదిక కేసీఎల్‌ | KCL is a nationwide sports and entertainment platform | Sakshi
Sakshi News home page

క్రీడా–కళాకారులకు సరికొత్త వేదిక కేసీఎల్‌

Oct 11 2026 9:19 PM | Updated on Oct 11 2026 9:19 PM

KCL is a nationwide sports and entertainment platform

ఐపీఎల్‌ విజృంభణతో... క్రీడలు, కళలు కలగలిసిపోతున్న పరిస్థితుల్లో... ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించే వేదికలు కూడా అదే బాట పట్టాయి. క్రీడాకారులను, గాయకులను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ప్రప్రధమంగా  ఇన్‌–డాట్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , ప్రసార భారతి సంస్థలు  కిసాన్‌ క్రికెట్‌ లీగ్‌ (కెసీఎల్‌)ను ఏర్పాటు చేశాయి.  గ్రామీణ , సెమీ–అర్బన్‌ ప్రాంతంలోని  క్రికెట్,  గాన ప్రతిభావంతులకు ఒక వ్యవస్థీకృత మార్గం ద్వారా ప్రపంచ వేదికను చేరుకోవడానికి  ప్రత్యేక అవకాశాన్ని కల్పించేందుకు రూపొందించిన దేశవ్యాప్త క్రీడా– వినోద వేదిక ఇది. దీనిని ఇటీవలే ప్రారంభించిన నేపధ్యంలో తమ కార్యాచరణను కెసీఎల్‌  ప్రతినిధులు వెల్లడించారు.

టాలెంట్‌ హంట్‌ షురూ..
‘ఖేలేగా భారత్, దేఖేగా ఇండియా‘ అనే నినాదంతో భారత దేశంలోనే అతిపెద్ద ప్రతిభాన్వేషణను నిర్వహించనుంది. డిజిటల్‌ ఆడిషన్లు, ఏఐ–ఆధారిత స్క్రీనింగ్‌ , ప్రత్యక్ష క్షేత్రస్థాయి ట్రయల్స్‌ వంటి వాటి ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ క్రికెటర్లు , గాయకులను ఇది ఒకచోట చేర్చనున్నారు.  ప్రత్యక్ష మ్యాచ్‌లు, రెండు రియాలిటీ షోలు  విజేతల జీవిత చరిత్రలతో సహా కెసీఎల్‌ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించేందుకు  వేవ్స్, ఓటీటీ, , దూరదర్శన్‌  ఆకాశవాణి ద్వారా జాతీయ  అంతర్జాతీయ ప్రేక్షకులకు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్‌ ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటుంది.

వైట్‌ బాల్‌ ప్రొఫెషనల్‌ ఫార్మాట్‌...
ఈ క్రికెట్‌ తొలి సీజన్ లో 15 ఓవర్ల వైట్‌–బాల్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఫార్మాట్‌లో 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు భారతదేశంలోని టైర్‌ 2 – 3 నగరాల్లోని ఏడు స్టేడియాలలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  దేశవ్యాప్తంగా టాలెంట్‌ హంట్‌ ద్వారా ఎంపిక చేసిన   బృందాల్లో 7 జట్లు, 140 మంది వర్ధమాన క్రికెటర్లు  30 మంది గాయకులు ఉంటారు. సుమారు లక్షల మంది నుంచి ఎంపికైన వీరి ప్రతిభను గుర్తించి, తీర్చిదిద్ది, ఈ లీగ్‌ ద్వారా ప్రదర్శిస్తారు. ఎంపికైన గాయకులు ప్రాంతీయ జట్ల గీతాలను ఆలపిస్తారు, మ్యూజిక్‌ వీడియోలలో కనిపిస్తారు  హాఫ్‌టైమ్, మ్యాచ్‌–డే ఈవెంట్లలో ప్రదర్శనలు ఇస్తారు.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టర్, ఐఏఎస్‌ అధికారి విక్రమ్‌ సింగ్‌ మాలిక్‌ మాట్లాడుతూ, ‘ దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రసార భారతి విస్తరించింది.  

అనేక భాషలు  శైలులలో సామాన్యులకు ఉచితంగా, విభిన్నమైన కంటెంట్‌ను అందించడమే మా ప్రయత్నం. మా తాజా ఆఫర్‌ ’వేవ్స్‌’ ఓటీటీ ఇప్పటికే 1.50 కోట్లకు పైగా చందాదారులను ఆకర్షించింది.‘ అని చెప్పారు. ‘’గ్రామీణ భారతదేశం నుంచి క్రికెటర్లుగా లేదా గాయకులుగా మారాలని కలలు కనే యువత ఆకాంక్షలను కిసాన్‌ క్రికెట్‌ లీగ్‌’ ద్వారా నెరవేర్చగలమని  ఆశిస్తున్నాం. యువతరాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి మా వేదికలు  వారధిగా పనిచేస్తాయి. క్రీడా–కళా రంగాల్లో తమదైన ముద్ర వేయాలని తపించే ఉత్సాహవంతులైన భారతీయ యువతకు కొత్త అవకాశాలను అందించాలని ఎదురుచూస్తున్నాం,‘ అని అన్నారాయన.

దశాబ్ధం నాటి కల...
కిసాన్‌ క్రికెట్‌ లీగ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ  జాతీయ అవార్డు గ్రహీత అయిన సినీ దర్శకుడు అతుల్‌ పాండే మాట్లాడుతూ  ‘నాకు కిసాన్‌ క్రికెట్‌ కేవలం ఒక క్రికెట్‌ లీగ్‌ కంటే ఎక్కువ. వినోదం, మీడియా , క్రీడా రంగాలలో 38 సంవత్సరాల అనుభవంతో రూపుదిద్దుకున్న ఈ వేదిక 2015 నుంచి నేను మోస్తున్న ఒక కల. నేను ఒక వర్ధమాన క్రికెటర్‌గా క్రికెట్‌తోనే జీవించాను,  1996, 1999 క్రికెట్‌ ప్రపంచ కప్‌లను కవర్‌ చేశాను. అలాగే, నిర్మాతగా నా మొదటి చిత్రం ’సమ్మర్‌ 2007’ ద్వారా గ్రామీణ భారతదేశ కథలను చెప్పాను. ఆ చిత్రం రైతుల ఆత్మహత్యలు  గ్రామీణ దుస్థితిని చూపింది. ఈ ప్రయాణమంతటిలో నాకు అర్ధం అయింది ఏమిటంటే...గ్రామీణ భారతదేశంలో అపారమైన ప్రతిభ, ఆశయం ఉన్నాయి, 

కానీ అందరికీ అవకాశం లభించదు. ‘దీనిని మార్చడానికి నా ప్రయత్నమే కేసీఎల్‌. వెనుకబడిన వర్గాల యువ ప్రతిభకు వారి కలలను సాకారం చేసుకోవడానికి, ఆడటానికి, పోటీపడటానికి , గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించడమే మా లక్ష్యం. ఎందుకంటే ఇది కేవలం క్రికెట్‌ గురించి మాత్రమే కాదు. ఇది ఒకరికి ఇంతకు ముందెన్నడూ లభించని అవకాశాన్ని ఇవ్వడం గురించి కూడా. మరోవైపు క్రికెట్‌ , గానం కలయికతో, ఆరు నెలల పాటు సాగే ఈ భారతీయ సాంస్కృతిక ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుంది.‘ ఈ ప్రయాణంలో, కేసీఎల్‌ మన జాతీయ హీరోలతో పాటు విజేతలను, వారి కమ్యూనిటీలను కూడా సత్కరిస్తుంది,‘ అని వివరించారు.

ఇదీ చదవండి:  చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement