‘యూరో’లో ఇటలీ శుభారంభం | Italys good start in Euro | Sakshi
Sakshi News home page

‘యూరో’లో ఇటలీ శుభారంభం

Jun 17 2024 3:06 AM | Updated on Jun 17 2024 3:06 AM

Italys good start in Euro

డార్ట్‌మండ్‌ (జర్మనీ): యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇటలీ జట్టు శుభారంభం చేసింది. అల్బేనియాతో జరిగిన గ్రూప్‌ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇటలీ 2–1తో గెలిచింది. ఆట మొదలైన 23 సెకన్లకే అల్బేనియా ప్లేయర్‌ బజ్రామి గోల్‌ చేయడంతో చేశాడు. 64 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా నమోదైన గోల్‌ ఇదే కావడం విశేషం. 

తొలి నిమిషంలో గోల్‌ సమరి్పంచుకున్న ఇటలీ వెంటనే తేరుకుంది. 11వ నిమిషంలో బస్తోని... 16వ నిమిషంలో బరెల్లా ఒక్కో గోల్‌ చేయడంతో ఇటలీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. హాంబర్గ్‌లో జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ జట్టు 2–1తో పోలాండ్‌ను ఓడించగా... స్టుట్‌గార్ట్‌లో డెన్మార్క్, స్లొవేనియా జట్ల మధ్య గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’ అయింది. 

Advertisement
 
Advertisement
Advertisement