టీమిండియా పేసర్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ | Sakshi
Sakshi News home page

టీమిండియా పేసర్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ

Published Fri, Dec 15 2023 8:33 PM

IPL 2024: Chetan Sakariya Named In Suspect Action List Of BCCI - Sakshi

టీమిండియా యువ బౌలర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ పేసర్‌ చేతన్‌ సకారియాకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ఐపీఎల్‌ 2024 వేలానికి ముందు ఈ సౌరాష్ట్ర బౌలర్‌ను అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చింది. బీసీసీఐ సకారియాను పూర్తిగా నిషేధించనప్పటికీ, అతని బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలు ఉన్నాయని ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు చెప్పకనే చెప్పింది. బీసీసీఐ చర్యతో 25 ఏళ్ల చేతన్‌ సకారియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బీసీసీఐ సకారియాతో పాటు మరో ఆరుగురు బౌలర్ల పేర్లను కూడా అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చింది. 

కాగా, ఐపీఎల్‌కు సంబంధించి ఆటగాళ్ల రిలీజ్‌ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇటీవలే సకారియాను రిలీజ్‌ చేసింది. అతను తిరిగి 2024 ఐపీఎల్‌ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో సకారియా 50 బేస్‌ ప్రైజ్‌ విభాగంలో 27 నంబర్‌తో రిజిస్టర్‌ చేయబడ్డాడు. బీసీసీఐ అనుమానిత బౌలర్ల జాబితాలో సకారియా పేరు చేర్చడంతో ఫ్రాంఛైజీలు ఇతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. సకారియా ఇప్పటివరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో 19 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ రెండు టీ20లు, ఓ వన్డేలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 

అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన ఇతర బౌలర్ల వివరాలు..

  • తనుష్‌ కోటియన్‌ (ముంబై)
  • రోహన్‌ కున్నుమ్మల్‌ (కేరళ)
  • చిరాగ్‌ గాంధీ (గుజరాత్‌)
  • సల్మాన్‌ నిజార్‌ (కేరళ)
  • సౌరబ్‌ దూబే (విదర్భ)
  • అర్పిత్‌ గులేరియా (హిమాచల్‌ప్రదేశ్‌)
  • మనీశ్‌ పాండే (కర్ణాటక)
  • కేఎల్‌ శ్రీజిత్‌ (కర్ణాటక)

పై పేర్కొన్న ఆటగాళ్లు అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన ఆటగాళ్ల జాబితాలో మాత్రమే చేర్చబడ్డారు. వీరిపై ఎలాంటి నిషేధమూ లేదు. బ్యాటింగ్‌కు సంబంధించి వీరిపై ఎలాంటి అంక్షలు ఉండవు.


 

Advertisement
Advertisement