Breadcrumb
Live Updates
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ లైవ్ అప్డేట్స్
రాజస్తాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాస్ బట్లర్ 54 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. హెట్‌మైర్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో యష్ దయాల్, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా , మహ్మద్ షమీ చెరొక వికెట్ తీశారు.
17 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ స్కోరు 145/7
17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. నీషమ్ 15, ప్రసిధ్ కృష్ణ ఒక పరుగుతో ఆడుతున్నారు. రాజస్తాన్ గెలవాలంటే 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉంది.
ఐదో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. 6 పరుగులు చేసిన వాండర్ డుసెన్ యష్ దయాల్ బౌలింగ్‌లో కీపర్ డే్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుత రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది
శాంసన్(11) రనౌట్.. కష్టాల్లో రాజస్తాన్ రాయల్స్
11 పరుగులు చేసిన శాంసన్ హార్దిక్ పాండ్యా సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. దీంతో నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది.
బట్లర్(54)ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
ఫెర్గూసన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి రాజస్తాన్‌ను దెబ్బతీశాడు. 54 పరుగులు చేసిన బట్లర్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగడంతో మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.
టార్గెట్ 193.. రెండు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 5 ఓవర్లలో రెండు
వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. బట్లర్ 22బంతుల్లోనే 48 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. అశ్విన్(8) ఫెర్గూసన్ బౌలింగ్‌లో మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్‌కు రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకముందు దేవదత్ పడిక్కల్ యష్ దయాల్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు
పాండ్యా, మిల్లర్ దూకుడు.. రాజస్తాన్ ముందు భారీ లక్ష్యం
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 87* పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో మిల్లర్ 14 బంతుల్లోనే 31*పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో రియన్ పరాగ్, చహల్, కుల్దీప్ సేన్ తలా ఒక వికెట్ తీశారు.
హార్దిక్ పాండ్యా అర్థశతకం.. గుజరాత్ టైటాన్స్ 158/4
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా రెండో అర్థశతకంతో మెరిశాడు. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. హార్దిక్ 75, మిల్లర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
13 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 101/3
13 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ స్కోరు 101/3గా ఉంది. హార్దిక్ పాండ్యా 42, అభినవ్ మనోహర్ 31 పరుగులతో ఆడుతున్నారు.
12 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 87/3
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 40, అభినవ్ మనోహర్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 13 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ రియన్ పరాగ్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ ఇచ్చి వెనుదిరిగాడు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
విజయ్ శంకర్(2) రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ నిర్లక్ష్యంగా షాట్ ఆడి శాంసన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.
మాథ్యూ వేడ్(12) రనౌట్.. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ 12 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో గిల్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. దీంతో వేడ్ సగం క్రీజు దాటి వచ్చేశాడు. అప్పటికే డుసెన్ బంతి అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయ్స్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. లాస్ట్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడి సీజన్లో గుజరాత్ తొలి ఓటమి చూసింది. బలబలాల్లో సమానంగా ఉన్న ఈ జట్లు మధ్య పోరు ఆసక్తికరంగా ఉండడం ఖాయం
Related News By Category
Related News By Tags
-
IPL 2026: రాజస్తాన్ రాయల్స్ ‘ఫ్యాన్స్’కి భారీ షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొట్టమొదటి సీజన్ విజేతగా రాజస్తాన్ రాయల్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన రాజస్తాన్.....
-
హెల్మెట్‌పై 'పాలస్తీనా జెండా' ధరించిన జమ్మూ కశ్మీర్ క్రికెటర్
జమ్ము అండ్ కశ్మీర్లో ఓ స్థానిక వ్యక్తి హెల్మెట్‌పై పాలస్తీనా జెండా ధరించి క్రికెట్ మ్యాచ్ ఆడటం వివాదాస్పదంగా మారింది. జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ పేరిట జరుగుతున్న క్రికెట్ టోర్నీలో ఫుర్కాన్ భ...
-
2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!
2025 సంవత్సరం మరి కొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం. 2026లో టీమిండియా చాలా బిజీగా గడపనుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పర...
-
జింబాబ్వే కెప్టెన్ ఇంట తీవ్ర విషాదం
జింబాబ్వే స్టార్ క్రికెటర్, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహ్ది అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు. హీమోఫీలియా కా...
-
శ్రీలంక క్రికెటర్ కన్నుమూత
శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు....


