IPL Auction 2022: Shreyas Iyer Confirmed Punjab-Kings Captain Will There Fortune Change - Sakshi
Sakshi News home page

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. స‌న్‌రైజ‌ర్స్‌లోకి కిష‌న్‌!

Jan 19 2022 3:42 PM | Updated on Jan 25 2022 11:04 AM

Ipl 2022 Auction Shreyas Iyer Confirmed Punjab-kings Captain Will There Fortune Change says reports - Sakshi

ఐపీఎల్ మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో  ఏ ఫ్రాంచైజీ ఏ ఆట‌గాడిని ద‌క్కించుకుంటుందో అన్న ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. ఈ క్ర‌మంలో ఆట‌గాళ్ల‌కు సంబంధించి రోజుకో ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రానున్న మెగా వేలంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ని పంజాబ్ కింగ్స్ కోనుగోలు చేయ‌నున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ జ‌ట్టు కెప్టెన్సీ భాధ్య‌త‌లు కూడా అప్ప‌జెప్పాల‌ని పంజాబ్ ఫ్రాంఛైజీ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఐపీఎల్‌ మెగా వేలం-2022 మెగా వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటిల్స్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ని రీటైన్ చేసుకోలేదు. అతడిని కెప్టెన్‌గా నియమించుకోవాలని మూడు ప్రధాన జట్లు భావిస్తున్నాయి. కాబట్టి అతడు భారీ ధర పలకడం ఖాయమే. కాగా అత‌డిని ద‌క్కించుకోవ‌డానికి ఆర్సీబీ, పంజాబ్‌, కేకేఆర్ ముందు వ‌రుస‌లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే.. ఇషాన్ కిష‌న్‌ కూడా  ముంబై ఇండియ‌న్స్ రిటైన్ చేసుకోపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో రానున్న మెగా వేలంలో ఇషాన్‌ను ద‌క్కించుకోవ‌డానికి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇప్పటి నుంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ మెగా వేలం ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నుంది.

చ‌ద‌వండి: Under 19 WC 2022: విండీస్‌ ప్లేయర్‌ "సూపర్ మ్యాన్ క్యాచ్‌"కు సలాం కొడుతున్న నెటిజన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement