భారత్‌ 0... ఆసీస్‌ 3 | Indian womens team lost in the last ODI | Sakshi
Sakshi News home page

భారత్‌ 0... ఆసీస్‌ 3

Jan 3 2024 4:24 AM | Updated on Jan 3 2024 4:24 AM

Indian womens team lost in the last ODI - Sakshi

ముంబై: భారత మహిళల జట్టు కొత్త ఏడాదిని భారీ పరాజయంతో ప్రారంభించింది. ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఏకంగా 190 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా మూడో విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీస్కోరు చేసింది. భారత జట్టుపై ఆ్రస్టేలియాకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (125 బంతుల్లో 119; 16 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ అలీసా హీలీ (85 బంతుల్లో 82; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించారు. వన్డేల్లో భారత జట్టుపై ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. భారత బౌలర్లలో శ్రేయాంక 3, అమన్‌జోత్‌ 2 వికెట్లు తీశారు. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 32.4 ఓవర్లలోనే 148 పరుగులకే కుప్పకూలింది.

బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. స్మృతి మంధాన (29; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, జెమీమా రోడ్రిగ్స్‌ (25; 3 ఫోర్లు), దీప్తి శర్మ (25 నాటౌట్‌; 2 ఫోర్లు)లు 20 పైచిలుకు స్కోర్లు చేశారంతే! కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (3) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమైంది. వేర్‌హమ్‌ 3, మేగన్‌ షుట్, అలానా కింగ్, అనాబెల్‌ సదర్లాండ్‌ తలా 2 వికెట్లు తీశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement