
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా రగ్బీ మహిళల అండర్–20 సెవెన్–ఎ–సైడ్ టోర్నమెంట్‌లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ముగిసిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో 12–5 పాయింట్ల తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టును ఓడించింది. భారత జట్టు తరఫున భూమిక శుక్లా 7 పాయింట్లు, గురియా కుమారి 5 పాయింట్లు స్కోరు చేశారు. ఉజ్బెకిస్తాన్ తరఫున హుల్కర్ ఒలెమ్‌బెర్గనోవా 5 పాయింట్లు సాధించింది.
అంతకుముందు లీగ్ దశలో భారత జట్టు కజకిస్తాన్, యూఈఏ జట్లపై గెలిచి హాంకాంగ్ చేతిలో ఓడిపోయి తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన హాంకాంగ్ తొలి స్థానంలో నిలిచి భారత్‌తోపాటు సెమీఫైనల్ చేరుకుంది. మరో గ్రూప్ నుంచి చైనా, ఉజ్బెకిస్తాన్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సెమీఫైనల్స్‌లో భారత్ 7–28తో చైనా చేతిలో, ఉజ్బెకిస్తాన్ 5–24తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయాయి. ఫైనల్లో చైనా 29–21తో హాంకాంగ్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది.