యువ భారత్‌ ‘హ్యాట్రిక్‌’ | Indian teams third win in a row in mens hockey tournament | Sakshi
Sakshi News home page

యువ భారత్‌ ‘హ్యాట్రిక్‌’

Oct 23 2024 3:33 AM | Updated on Oct 23 2024 3:33 AM

Indian teams third win in a row in mens hockey tournament

కౌలాలంపూర్‌: సుల్తాన్‌ జొహర్‌ కప్‌ అండర్‌–21 పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఆతిథ్య మలేసియా జట్టుతో మంగళవారం జరిగిన రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 4–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. 

భారత్‌ తరఫున శారదానంద్‌ తివారీ (11వ నిమిషంలో), అర్‌‡్షదీప్‌ సింగ్‌ (13వ నిమిషంలో), తాలెమ్‌ ప్రియోబర్తా (39వ నిమిషంలో), రోహిత్‌ (40వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. మలేసియా జట్టుకు మొహమ్మద్‌ డానిష్‌ (8వ నిమిషంలో), హారిస్‌ ఉస్మాన్‌ (9వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. 

భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు, మలేసియా జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐదు పాయింట్లతో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్‌ ఆడుతుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక టాప్‌–2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement