ముగిసిన భారత్‌ పోరు  | Indian players lose in Hong Kong Open | Sakshi
Sakshi News home page

ముగిసిన భారత్‌ పోరు 

Sep 15 2023 1:47 AM | Updated on Sep 15 2023 1:47 AM

Indian players lose in Hong Kong Open - Sakshi

కౌలూన్‌: హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు ఓటమి చవిచూశాయి.

గాయత్రి–ట్రెసా 8–21, 14–21తో అప్రియాని రహాయు–సితి ఫాదియా (ఇండోనేసియా)ల చేతిలో... అశి్వని–తనీషా 18–21, 7–21తో టాప్‌ సీడ్‌ మయు మత్సుమోటో–వకాన నగహారా (జపాన్‌)ల చేతిలో పరాజయం పాలయ్యారు. గాయత్రి, అశ్విని జోడీలకు 1,575 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement