5000 మీటర్లలో గుల్‌వీర్‌ కొత్త జాతీయ రికార్డు Indian Athlete Gulveer Singh Eclipses 5000m National Record Portland Meet. Sakshi
Sakshi News home page

5000 మీటర్లలో గుల్‌వీర్‌ కొత్త జాతీయ రికార్డు

Published Tue, Jun 11 2024 10:52 AM

Indian Athlete Gulveer Singh Eclipses 5000m National Record Portland Meet

భారత అథ్లెట్‌ గుల్‌వీర్‌ సింగ్‌ పురుషుల 5000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌ ట్రాక్‌ ఫెస్టివల్‌ హై పెర్ఫార్మెన్స్‌ మీట్‌లో గుల్‌వీర్‌ ఈ ఘనత సాధించాడు. 

ఈ మీట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల గుల్‌వీర్‌ 5000 మీటర్లను 13 నిమిషాల 18.92 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అవినాశ్‌ సాబ్లే (13ని:19.30 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును గుల్‌వీర్‌ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం 10,000 మీటర్ల లోనూ జాతీయ రికార్డు గుల్‌వీర్‌ పేరిటే ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement