తొలి విజయం లక్ష్యంగా...

India womens teams only Test against Australia from today - Sakshi

నేటి నుంచి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఏకైక టెస్ట్‌

ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్‌ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

ముంబై: ఇంగ్లండ్‌ జట్టుపై సాధించిన ఘనవిజయం స్ఫూర్తితో... నేటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే నాలుగు రోజుల ఏకైక టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా 347 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఆ్రస్టేలియా జట్టుపై భారత రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన 10 టెస్టుల్లో భారత్‌ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది.

నాలుగు టెస్టుల్లో ఓడిన భారత జట్టు... ఆరు టెస్టులను డ్రా చేసుకుంది. 1984 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో భారత్‌ టెస్టు ఆడనుండటం గమనార్హం. ఆసీస్‌పై భారత్‌ తొలి గెలుపు సాధించాలంటే సమష్టి ప్రదర్శన తప్పనిసరి. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షపాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, యస్తిక భాటియా భారీ స్కోర్లు చేయాలి. 

ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, పూజా 
వస్త్రకర్‌ కూడా తమవంతు పాత్రను పోషించారు. బౌలర్‌ రేణుక సింగ్‌ తన స్వింగ్‌ బౌలింగ్‌ పేస్‌తో ఆసీస్‌ బ్యాటర్లను కట్టడి చేయాలి. మరోవైపు అలీసా హీలీ నాయకత్వంలో ఆ్రస్టేలియా జట్టు కూడా పటిష్టంగా ఉంది. బెత్‌ మూనీ, యాష్లే గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, ఎలీసా పెర్రీ, అనాబెల్‌ సదర్లాండ్‌ ప్రదర్శనపై ఆ్రస్టేలియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top