అజేయంగా భారత్‌  | India win over Korea | Sakshi
Sakshi News home page

అజేయంగా భారత్‌ 

Nov 3 2023 1:12 AM | Updated on Nov 3 2023 1:12 AM

India win over Korea - Sakshi

రాంచీ: సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ఆసియా హాకీ మహిళల చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు లీగ్‌ దశను అజేయంగా ముగించింది. దక్షిణ కొరియా జట్టుతో గురువారం జరిగిన చివరిదైన ఐదో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది.

భారత్‌ తరఫున సలీమా టెటె (6వ, 36వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... నవ్‌నీత్‌ కౌర్‌ (36వ ని.లో), వందన కటారియా (49వ ని.లో), నేహా (60వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

తొమ్మిది పాయింట్లతో చైనా రెండో స్థానంలో, జపాన్‌ మూడో స్థానంలో, ఏడు పాయింట్లతో కొరియా నాలుగో స్థానంలో నిలిచి భారత్‌తోపాటు సెమీఫైనల్‌కు అర్హత పొందాయి. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌తో చైనా; కొరియాతో భారత్‌ తలపడతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement