India Vs England 5th Test: Playing XI And Indian Captain Bumrah Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Ind Vs Eng 5th Test: నాకు దక్కిన గొప్ప గౌరవం.. బుమ్రా భావోద్వేగం

Jul 1 2022 3:33 PM | Updated on Jul 1 2022 4:44 PM

India Vs England 5Th Test: Playing XI And Indian Captain Bumrah Comments - Sakshi

India Vs England 5Th Test: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు నేపథ్యంలో రోహిత్‌ శర్మ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. తొలిసారి భారత జట్టు సారథి హోదాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌తో కలిసి టాస్‌ సమయంలో ఎడ్జ్‌బాస్టన్‌ మైదానానికి వచ్చాడు. 

ఈ సందర్భంగా జస్‌ప్రీత్‌ బుమ్రా మాట్లాడుతూ.. ‘‘భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కడం నాకు దక్కిన గౌరవం. ఇంతకంటే నేను కోరుకునేది మరేదీ లేదు. కెప్టెన్సీ విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

మేము మ్యాచ్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. టీ20 సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌కు వచ్చిన మేము ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రిపేర్ అయ్యాము. కావాల్సినంత ప్రాక్టీసు దొరికింది. మేము.. నాతో కలిపి నలుగురు బౌలర్లు సిరాజ్‌, శార్దూల్‌, షమీతో పాటు ఆల్‌రౌండర్‌ జడ్డూ(రవీంద్ర జడేజా)తో కలిసి బరిలోకి దిగుతున్నాము’’ అని బుమ్రా పేర్కొన్నాడు.


PC: BCCI

తుది జట్లు:
భారత జట్టు: శుబ్‌మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా(కెప్టెన్‌).

ఇంగ్లండ్‌: అలెక్స్‌ లీస్‌, జాక్‌ క్రాలే, ఓలీ పోప్‌, జొ రూట్‌, జానీ బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), సామ్‌ బిల్లింగ్స్‌(వికెట్‌ కీపర్‌), మాథ్యూ పాట్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జాక్‌ లీచ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌.

చదవండి: AUS vs SL: తొలి టెస్టులో శ్రీలంక చిత్తు.. ఆస్ట్రేలియా ఘన విజయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement