
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే మార్పుతో బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు మేనెజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. అదే విధంగా స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్,కారీ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్
ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ