ఆస్ట్రేలియాతో మూడో టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా | India Eye On World Record In 3rd T20I Against Australia | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా

Published Tue, Nov 28 2023 3:51 PM | Last Updated on Tue, Nov 28 2023 4:18 PM

India Eye World Record In the 3rd T20I Against Australia - Sakshi

గౌహతి వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడో టీ20లో కూడా కూడా అదే జోరును కనబరిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఓ వరల్డ్‌ రికార్డు ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా పాకిస్తాన్‌ వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేస్తోంది. తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో గెలుపొందిన టీమిండియా.. పాకిస్తాన్‌ పేరిట ఉన్న ఈ అరుదైన ఫీట్‌ను సమం చేసింది. 

రిటీమిండియా ఇప్పటివరకు 211 మ్యాచ్‌ల్లో 135 విజయాలను అందుకుంది. పాకిస్తాన్‌ కూడా పాక్‌ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలు సాధించింది. ఈ క్రమంలో గౌహతి మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాకిస్తాన్‌ వరల్డ్‌ రికార్డును భారత్‌ బద్దలు కొడుతోంది. 
చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement