ఒంటిచేత్తో గిల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. షాకైన ఫ్యాన్స్‌! | IND vs SL: Gill Takes Stunning One Handed Catch To Dismiss Mendis | Sakshi
Sakshi News home page

ఒంటిచేత్తో గిల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. షాకైన ఫ్యాన్స్‌!

Aug 17 2026 12:33 PM | Updated on Aug 17 2026 12:51 PM

IND vs SL: Gill Takes Stunning One Handed Catch To Dismiss Mendis

Photo Credit: BCCI X

శ్రీలంకతో తొలి టెస్టులో  టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. గాలె వేదికగా సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా.. ఒంటిచేత్తో గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

462 ఆలౌట్‌
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా భారత్‌- శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. మూడో రోజు 460/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్‌.. మరో రెండు పరుగులు జతచేసి ఆలౌట్‌ అయింది.

అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా.. భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఓపెనర్లలో నిశాన్‌ ఫెర్నాండోను మహ్మద్‌ సిరాజ్ డకౌట్‌ చేయగా.. లాహిరు ఉదార (27)నున మానవ్‌ సుతార్‌ పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్‌ చండిమాల్‌ (4) వికెట్‌ను కూడా మానవ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఒంటిచేత్తో  స్టన్నింగ్‌ క్యాచ్‌
ఇక కమిందు మెండిస్‌ నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా.. గిల్‌ ఊహించని రీతిలో అతడిని పెవిలియన్‌కు పంపాడు. లంక ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్లో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బంతితో రంగంలోకి దిగాడు. 

కుల్దీప్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీని మెండిస్‌ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ దిశగా ఎక్స్‌ ట్రా కవర్‌ మీదుగా షాట్‌ బాదాడు. ఇంతలో తన ఫీల్డింగ్‌ పొజిషన్‌ నుంచి ఎడమవైపునకు డైవ్‌ చేసిన గిల్‌.. ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు.

షాక్‌లో మెండిస్‌, అభిమానులు
ఈ క్రమంలో అదుపు తప్పి నేల మీద పడిపోయినప్పటికీ బంతిని మాత్రం చేజారనివ్వలేదు గిల్‌. దీంతో కమిందు మెండిస్‌తో పాటు..స్టేడియంలో ఉన్న శ్రీలంక అభిమానులు సైతం నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి శ్రీలంక.. 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.

లంక ఓపెనర్లలో నిశాన్‌ ఫెర్నాండో డకౌట్‌ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేశాడు. దినేశ్‌ చండిమాల్‌ (4) నిరాశపరచగా.. కమిందు మెండిస్‌ 14, కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ 21 పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. భారత బౌలర్లలో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఒక​ వికెట్‌ తీయగా.. స్పిన్నర్లలో మానవ్‌ సుతార్‌ రెండు, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

చదవండి: పంత్‌ చేయలేనిది.. బట్లర్‌ సాధించాడు.. సంతోషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement