PC: BCCI X
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఫలితంగా భోజన విరామ సమయానికి శ్రీలంక సగం వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులే చేయగలిగింది.
కాగా గాలె వేదికగా 460/9 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో రెండు పరుగులు జోడించి (462) ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా ఆది నుంచే భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
Early breakthrough for Team India! 💥
Mohammed Siraj strikes with just the second ball.
Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #MohammedSiraj #BeautifulGameOfTestCricket pic.twitter.com/zHSQOGD0jj— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026
సిరాజ్ మొదలు పెట్టగా..
ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండోను పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ చేయగా.. లాహిరు ఉదార 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
మానవ్ సుతార్‌కు రెండు
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండిమాల్ (4)ను స్వల్ప స్కోరుకే మానవ్ పెవిలియన్‌కు పంపాడు. కమిందు మెండిస్ (14) కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టగా.. లంక నాలుగో వికెట్ కోల్పోయింది.
Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤
Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026
ఇక కెప్టెన్ ధనంజయ డి సిల్వ (21) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు ఊహించని రీతిలో క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సోమవారం లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది.
సొనాల్ దినుష 14, నిరోషన్ డెక్‌విల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే లంక ఇంకా 363 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్‌లో భారత స్పిన్నర్లు మానవ్, కుల్దీప్, జడేజా కలిసి నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం.


